ఆగస్టు 30,31 తేదీల్లో అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన

JanaSena Party Files Complaint Against YSRCP Social Media Wing,Pawan Kalyan To Visit Amaravati On August 30 and 31st,Mango News,Janasena Party Chief Pawan Kalyan to visit Amaravati,Pawan Kalyan Latest News,Andhra Pradesh Latest News,AP Political News,Andhra Pradesh Political News,AP Political Telugu News,Today Latest Andhra Pradesh Political News,Jana Sena leaders file case against YSRCP social media wing

ఆగస్టు 24, శనివారం నాడు హైదరాబాద్ జనసేన కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. రాజధాని సమస్యలపై రైతుల పోరాటానికి మద్ధతు ఇవ్వాలని కోరారు. గత వారం రోజులుగా రాష్ట్ర మంత్రులు రాజధాని విషయంలో చేసే వ్యాఖ్యలు తమతో పాటు, రాష్ట్రప్రజలందరిని గందరగోళానికి గురిచేస్తున్నాయని చెప్పారు. వరద ముంపు పేరుతో జరుగుతున్న వివాదంపై రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. రాజధాని పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని రైతులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతుల ఆవేదనను అర్ధం చేసుకున్నానని, వారికీ అండగా నిలుస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఎట్టిపరిస్థితుల్లో అమరావతి నుంచి తరలించకూడదని అన్నారు. కీలకమైన రాజధాని విషయంలో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటపోతే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందని చెప్పారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వ నిర్ణయాలను మెరుగ్గా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 30,31 తేదీల్లో రాజధాని ప్రాంతమైన అమరావతిలో పర్యటిస్తానని చెప్పారు. అక్కడ రైతులని కలుసుకుంటానని, ఇప్పటివరకు జరిగిన పనులను, నిలిచిపోయిన పనులను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

 

[subscribe]
[youtube_video videoid=fBWLFfPKsdk]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =