వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో లోటస్ పాండ్ లోని ఆమె ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే ఇంటివద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఆమెను బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. దీంతో షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగగా.. వైఎస్‌ఆర్‌టీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలో తోపులాటలో చిక్కుకున్న వైఎస్ షర్మిల కిందపడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను అడ్డుకోవచ్చు కానీ, సమస్యలపై ప్రశ్నించే తన గొంతుకను మాత్రం అడ్డుకోలేరంటూ మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE