జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జూన్ 4వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, పీఏసీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల చైర్మన్లు, నియోజకవర్గ ఇంచార్జిలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, వీరమహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.
జూన్ 4, శనివారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సుమారు 4 గంటల పాటు కొనసాగనుందని, ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు, జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై లోతుగా చర్చిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలను కూడా ఆమోదిస్తారని తెలిపారు. అలాగే ఈ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ జూన్ 3వ తేదీ సాయంత్రం నాటికి మంగళగిరి చేరుకుంటారని ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF