జనవరి 12న రణస్థలంలో ‘యువశక్తి’ కార్యక్రమం, పోస్టర్ ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Unveils Yuvashakti Program Poster which to be held at Ranasthalam Srikakulam Dist on January 12th,Pawan Kalyan Unveils Yuvashakti Program Poster, which to be held at Ranasthalam, Srikakulam Dist on January 12th,Mango News,Mango News Telugu,Ranasthalam Srikakulam Dist,Yuvashakti Program Poster,Yuvashakti Program,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన నింపిన స్ఫూర్తితో ఈ నెల 12వ తేదీన రణస్థలంలో యువశక్తి తడాఖా చూపించబోతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అచంచలమైన ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు తీసుకొచ్చేలా, ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో నిర్వహించబోయే “యువశక్తి” కార్యక్రమం పోస్టర్లను సోమవారం హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమానికి యువతీ యువకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. యువతరాన్ని అత్యధికంగా కలిగిన దేశంగా భారతదేశానికి పేరు. దేశానికి వెన్నెముక వారు. ఉత్తరాంధ్ర యువతరం వలసల బాట పడుతోంది. చదువులకు సైతం వేరే ప్రాంతాలకు వారు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఉపాధి దొరక్క పొట్ట చేతపట్టుకొని వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వలసలు, ఉపాధి లేమి, విద్యావకాశాలు, వ్యాపార అవకాశాలు, ఇతర సమస్యలపై, అన్నీ అంశాలపై సమగ్రంగా యువత అభిప్రాయాలు తెలియజేసేందుకు యువశక్తి కార్యక్రమం వేదిక అవుతుంది. ఎలాంటి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. ప్రభుత్వ పాలసీలు ఎలా ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాలు యువత తెలియజేసేందుకు యువశక్తి వేదిక గళమవుతుంది. నాతోపాటు వేదికపై 100 మంది యువతీయువకులు కూర్చొని, ఉత్తరాంధ్ర పరిస్థితులు, సమస్యలతోపాటు కష్టాల నుంచి విజయాలు సాధించిన గొప్ప స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా కార్యక్రమం ఉంటుంది. ఉత్తరాంధ్ర యువత కలలుగనే రేపటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది వారే ఆవిష్కరిస్తారు. వారి ఆలోచనలను, ఆవేదనలను వారి గొంతు నుంచే విందాం. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి.. ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక్కటే ‘మన యువత, మన భవిత’ అనేదే ప్రధాన నినాదంగా యువశక్తిని విజయవంతం చేద్దాం” అని అన్నారు.

యువశక్తి పోస్టర్ ఆవిష్కరణలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు, పొలిట్ బ్యూరో సభ్యుడు అర్హం ఖాన్, ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, కార్యక్రమాల కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =