ఆత్మకూరు ఉపఎన్నిక : వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి, బీ-ఫామ్‌ అందజేసిన సీఎం వైఎస్ జగన్

Atmakuru Bye-election CM YS Jagan Handover B-Form to YSRCP Candidate Mekapati Vikram Reddy, CM YS Jagan Handover B-Form to YSRCP Candidate Mekapati Vikram Reddy, AP CM YS Jagan Handover B-Form to YSRCP Candidate Mekapati Vikram Reddy, AP CM YS Jagan Mohan Reddy Handover B-Form to YSRCP Candidate Mekapati Vikram Reddy, AP CM YS Jagan Mohan Reddy Handover B-Form to YSRCP Candidate, YSRCP Candidate Mekapati Vikram Reddy, B-Form to YSRCP Candidate Mekapati Vikram Reddy, Mekapati Vikram Reddy, Atmakuru Bye-Poll, Atmakuru Bye-election, Atmakuru Bye-election News, Atmakuru Bye-election Latest News, Atmakuru Bye-election Latest Updates, Atmakuru Bye-election Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇటీవలే ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక కోసం మే 30న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగా, అదే రోజు నుంచి నామినేష్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణించడంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ప్రస్తుతం ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్‌ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు.

ఈ నేపథ్యంలో బుధవారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైఎస్ జగన్ ను మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి బీ-ఫామ్‌ అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలకు జూన్ 6 ఆఖరితేదీ కాగా, జూన్ 7న నామినేషన్ల పరిశీలన, జూన్ 9 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరుతేదీగా ప్రకటించారు. ఇక జూన్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించి, జూన్ 26వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eighteen =