ఏపీలో లంచాలపై ఫిర్యాదులకు కొత్తగా ‘ఏసీబీ 14400″ మొబైల్ యాప్.. ప్రారంభించిన సీఎం జగన్‌

AP CM YS Jagan Launches ACB 14400 Mobile App For The Complaints Against Anti Corruption, AP CM Launches ACB 14400 Mobile App For The Complaints Against Anti Corruption, CM YS Jagan Launches ACB 14400 Mobile App For The Complaints Against Anti Corruption, YS Jagan Launches ACB 14400 Mobile App For The Complaints Against Anti Corruption, Complaints Against Anti Corruption, ACB 14400 Mobile App, ACB 14400, Mobile App, AP CM YS Jagan Launches ACB Mobile App, AP YS Jagan launches mobile app to curb corruption in Andhra Pradesh, Andhra Pradesh government launches ACB 14400 Mobile App, 14400 mobile app has been launched to curtail corruption, AP CM YS Jagan Launched mobile application ACB 14400 developed by the Anti-Corruption Bureau, ACB 14400 Mobile App News, ACB 14400 Mobile App Latest News, ACB 14400 Mobile App Latest Updates, ACB 14400 Mobile App Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను రూపొందించింది. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలలో ఎక్కడా అవినీతి అనేది ఉండకూడదనేదే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఈ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయటానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇకపై ఎవరైనా లంచాలపై ఫిర్యాదులు చేయదలిస్తే డైరెక్టుగా ఈ యాప్ ద్వారానే చేయొచ్చని సీఎం సూచించారు.

అయితే దీనికి ముందుగా ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లో ‘ఏసీబీ 14400’ యాప్‌ను డౌన్ లోడ్‌ చేసుకోవాలని సీఎం జగన్‌ కోరారు. తదుపరి మీకు ఎప్పుడైనా ప్రభుత్వ కార్యాలయాలలో.. ఆర్డీఓ కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు, పోలీస్‌స్టేషన్‌, సచివాలయాలు, 108, 104 సర్వీసులు సహా చివరకు అది కలెక్టరేట్‌ అయినా సరే ఎక్కడైనా కూడా లంచం అడిగితే వెంటనే బటన్‌ ప్రెస్‌చేసి వీడియో ద్వారా కాని, ఆడియో ద్వారా కాని అక్కడి సంభాషణను రికార్డు చేయండి. అది నేరుగా ఏసీబీ హెడ్ ఆఫీస్ కి చేరుతుందని, తక్షణమే వారు చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీంతో పాటు ఆ ఫిర్యాదులను ఏసీబీ నేరుగా సీఎంవో కు తెలియజేస్తుందని, తద్వారా పూర్తి పారదర్శకంగా దీనిపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =