జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులతో, పార్టీ వాలంటీర్లతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 16వ తేదీన విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా ఆయా జిల్లాల నుంచి ప్రజా సమస్యలపై వచ్చే వినతులను పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నారు. అలాగే అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు పలు అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY







































