మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక: ఇప్పటికి దాఖలైన నామినేషన్స్ ఎన్నంటే?

Munugode Bye-election 12 Candidates Files Nominations till October 10, 12 Candidates Files Nominations Munugode By-Election, Munugode By-Election Nomination, Munugoed By-poll, Maram Venkat Reddy Independent 1 Set, Komatireddy Rajagopal Reddy BJP 3 sets, Palvai Sravanti Congress 1 Set, Chandra Shekhar Chalika Independent 2 sets, Black Naveen Kumar Independent 2 sets, Nikhil Reddy Independent 1 set, Krishnam Raju Chittiboyana Independent 1 set, Srikanth Siliveru Independent 2 sets, Beri Venkatesh Independent 1 Set, Than Sayanna Independent 1 Set, Udali Mallesh Independent 1 Set, Krishna Varikuppala Independent 1 Set, Mango News, Mango News Telugu,

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు అక్టోబర్ 7, శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కాగా, అదే రోజు నుండి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమయింది. నామినేషన్ల స్వీకరణ కోసం చండూరు తహసీల్దార్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10, సోమవారం వరకు మునుగోడు ఉపఎన్నికకై 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 12 మంది అభ్యర్థులు కలిసి మొత్తం 17 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్స్ దాఖలు చేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మొదటి సెట్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఇక అక్టోబర్ 14వ తేదీతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. అలాగే నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 15న జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 17గా ప్రకటించారు.

ఇప్పటివరకు మునుగోడు ఉపఎన్నిక కోసం నామినేషన్స్ వేసింది వీరే:

  1. మారం వెంకట్ రెడ్డి – ఇండిపెండెంట్ – 1 సెట్
  2. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి – బీజేపీ – 3 సెట్లు
  3. పాల్వాయి స్రవంతి – కాంగ్రెస్ – 1 సెట్
  4. చంద్ర శేఖర్ చాలికా – ఇండిపెండెంట్ – 2 సెట్లు
  5. నల్లపు నవీన్ కుమార్ – ఇండిపెండెంట్ – 2 సెట్లు
  6. నిఖిల్ రెడ్డి – ఇండిపెండెంట్ – 1 సెట్
  7. కృష్ణం రాజు చిట్టిబోయన – ఇండిపెండెంట్ – 1 సెట్
  8. శ్రీకాంత్ సిలివేరు – ఇండిపెండెంట్ – 2 సెట్లు
  9. బేరి వెంకటేష్ – ఇండిపెండెంట్ – 1 సెట్
  10. కంటే సాయన్న – ఇండిపెండెంట్ – 1 సెట్
  11. ఉదరి మల్లేశ్ – ఇండిపెండెంట్ – 1 సెట్
  12. కృష్ణ వరికుప్పల – ఇండిపెండెంట్ – 1 సెట్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =