తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక, జనసేన కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు

Janasena Party Appointed Executive Committee For Tirupati Lok Sabha,Janasena To Contest In Tirupati LS Bypoll,Lok Sabha,Lok Sabha Bypoll,Janasena Party,Janasena Party Latest News,Janasena Party New Updates,Janasena Party Appointed Executive Committee,Janasena Party Executive Committee,Executive Committee,Tirupati Lok Sabha,Mango News,Mango News Telugu,Janasena Party Tirupati Lok Sabha,Janasena Party Chief Pawan Kalyan,Janasena Party Appointed Committee Due To Tirupati By Election,Tirupati By Election,Janasena,Janasena Contest In Tirupati,Janasena Executive Committee,Pawan Kalyan,Tirupati By Election News,Pawan Kalyan Latest News,Tirupati LS Bypolls,Executive Committee

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ స్థానం పరిధిలో పార్టీ పరంగా శ్రేణులను సమాయత్తపరిచేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలో క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ జనసేన విధానాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కమిటీలో పార్టీపరంగా క్రియాశీలకంగా ఉన్న వారిని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో పర్యటనలు చేపడుతుందని, క్షేత్ర స్థాయిలో శ్రేణులను సమన్వయం చేసుకొంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తారని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా సమస్యలను, రాజకీయ సంబంధిత విషయాలను క్రోడీకరించి ఎప్పటికప్పుడు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు నివేదికలు అందజేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

కార్యనిర్వాహక కమిటీ సభ్యులు:

  1. డా.పి.హరిప్రసాద్,
  2. మనుక్రాంత్ రెడ్డి
  3. రాందాస్ చౌదరి
  4. కిరణ్ రాయల్
  5. వినుత
  6. పొన్న యుగంధర్
  7. ఉయ్యా ల ప్రవీణ్
  8. తీగల చంద్రశేఖర్
  9. గూడూరు వెంకటేశ్వర్లు
  10. కంటేపల్లి ప్రసాద్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ