పాల్ మళ్లీ కామెడీ పాలవుతారా?

KA Paul ,KA Paul entry in AP, Chandrababu, Lokesh, TDP,Jagan,Babu Mohan, Praja Shanti Party, YCP, BJP, Jana Sena,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
KA Paul ,KA Paul entry in AP, Chandrababu, Lokesh, TDP,Jagan,Babu Mohan, Praja Shanti Party, YCP, BJP, Jana Sena,

తూటాల్లాంటి నేతల మాటలు, ఆ మాటలకు ఘాటు కౌంటర్లు, అభ్యర్దులకు అధిష్టానం టికెట్ ప్రకటనలు, టికెట్ రాని నేతల అసంతృప్తులు, సొంతపార్టీలో నేతల పరేశాన్‌లు, అలకలు, అధినేతల బుజ్జగింపులతో ఏపీలో పొలిటికల్ వాతావరణం రోజు రోజుకు హీటెక్కిపోతోంది. ఇలా హాటుహాటుగా సాగుతున్న ఏపీ రాజకీయాలలోకి ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంట్రీ ఇవ్వడంతో.. పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయినట్లు అయింది.

మొన్నటివరకూ తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమైన పాల్..ఏపీలోనూ ఎంటర్ అయ్యారు. వచ్చీ రావడంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.మంగళగిరిలో చంద్రబాబు నిర్వహించిన బీసీ గర్జనలో బీసీలకు వరాలు ప్రకటించడాన్ని కేఏ పాల్ తప్పుబట్టారు. ఎర్రం నాయుడు బీసీ నాయకుడు కాదా..మరి  అప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేయలేదని చంద్రబాబును కేఏ పాల్ ప్రశ్నించారు. అంతేకాదు ఎంతోమంది బీసీలను చంద్రబాబు ఎదగనీయలేదంటూ ఆరోపించారు.

ఏపీలో 60 శాతం జనాభా ఉన్న బీసీలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని అందుకే  చాలామంది నాయకులు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలలో మూడు శాతం జనాభా ఉన్నవాళ్లు ఏపీని పాలిస్తున్నారని.. ఈ ముఠా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటూ” పాల్  వీడియో విడుదల చేశారు. నిజమే కేఏ పాల్ అడిగినవన్నీ విజన్  ఉన్న నేతగా చెప్పుకునే చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాల్సిన  ప్రశ్నలే.  పాల్ అన్నట్లుగానే ఏపీలో బీసీలకు అన్యాయం జరిగిందనేది కూడా నిజమే.

కానీ కేఏ పాల్ అంటే కామెడీ పండించే పాల్ గానే జనాలకు రిజిస్ట్రర్ అయిపోయింది. దీంతో  ఇప్పుడు పాల్ సీరియస్ గా ప్రశ్నలు సంధించినా కామెడీనే వెతుక్కుంటున్నారు జనాలు. దీంతో చంద్రబాబుపై పాల్ మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ సీరియస్‌గా సాగుతున్న ఏపీ రాజకీయాలలోకి కామెడీని పండించడానికి కేఏ పాల్ వచ్చేసారంటూ  నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలే వేసవిలో ఈ వేడి చంపేస్తోంది దానికి తోడు ఎన్నికల హీటు ఇలాంటప్పుడు పాల్ కామెడీనే బెస్ట్ మెడిసన్ అంటూ మరికొంతమంది అంటున్నారు.

ఇక కేఏ పాల్ తన ప్రజాశాంతి పార్టీలోకి  తాజాగా బాబూ మోహన్ ను చేర్చుకున్నారు. బాబూమోహన్ గతంలో టీడీపీలో పనిచేశారు అలాగే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు . ఆ తర్వాత బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇన్ని పార్టీలు మారి  చివరిగా ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్ గురించి పాల్ గొప్పగా చెప్పుకోవడాన్ని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి పాల్ ఏపీ పాలిటిక్స్ లో ఏమాత్రం తన ప్రభావాన్ని  చూపిస్తారో?

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE