జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ద్వారంపూడిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ద్వారంపూడి వచ్చే ఎన్నికల్లో పవన్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు. శనివారం నాడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంలో ప్రత్యేకించి తాను ఇన్ చార్జ్ పోస్ట్ తీసుకుంటానని, అక్కడ పార్టీ కోసం పనిచేసి ఆయనను ఓడిస్తానని శపథం చేశారు. పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, పవన్ వైఖరి కారణంగా త్వరలోనే జనసేన కార్యకర్తలు బాధపడే రోజు వస్తుందన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి. ద్వారంపూడి చేసిన తాజా వ్యాఖ్యలపై జనసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ







































