ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యా క్షిపణి దాడులతో కలుషితమవుతున్న గాలి, తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు

Russia-Ukraine War Amid Continuous Attacks Kyiv Residents Face Difficulties in Breathing, Russia-Ukraine War Amid Continuous Attacks, Amid Continuous Attacks, Kyiv Residents Face Difficulties in Breathing, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Updates, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Crisis, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌లో రష్యా దాడి నేపథ్యంలో రాజధాని కైవ్ లోని నివాసిత ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. నిరంతర బాంబు పేలుళ్ల కారణంగా ఏర్పడుతున్న దట్టమైన పొగ కారణంగా కైవ్‌లో ప్రజలు శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోతున్నారని వారు తెలిపారు. కైవ్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నివేదిక ప్రకారం, ఈ ప్రాంతంలో కాలుష్య కారకాల సాంద్రత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ప్రమాణం కంటే 19.9 రెట్లు ఎక్కువ. ఉక్రెయిన్ ‌దేశం‌పై రష్యా సైనిక చర్య మొదలై 24 రోజులు గడుస్తోంది. ఇన్ని రోజులుగా జరుగుతున్న వరుస బాంబు దాడులతో అక్కడి గాలి విషపూరితమైందని, ఇది ప్రజలు ప్రాణాలను హరించివేస్తుందని నివేదికలు తెలుపుతున్నాయి.

మరోవైపు రష్యా సైనికులు కైవ్‌తో సహా ఉక్రేనియన్ నగరాలపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. రష్యన్ వైపు నుండి కాల్పులు ఎల్వివ్ శివార్లలో మరియు పోలిష్ సరిహద్దుకు సమీపంలో ఉన్న విమాన మరమ్మతు వ్యవస్థను కూడా తాకాయి. రష్యా సాయుధ బలగాలు ఎప్పటికప్పుడు తమ రక్షణను పరీక్షిస్తున్నాయని, కానీ ఉక్రేనియన్ దళాలు తమ మాతృభూమిని కాపాడుకుంటూనే ఉన్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా, ఉక్రెయిన్‌లో మూడు వారాల పాటు రష్యా బాంబు దాడులు జరిగినప్పటికీ, దేశంలో పోరాటాలు కొనసాగుతున్నందున ఉక్రెయిన్ తన నగరాలకు గట్టి రక్షణ కల్పిస్తోంది. కాగా ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దాడిలో దాదాపు 14,200 మంది రష్యన్ సైనికులు మరణించారని ఉక్రేనియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =