ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తెలుగుదేశం పార్టీ (టీడీపీ)పై మరియు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కన్నా తమ హయాంలో గొప్ప పరిపాలన అందించామని చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఏపీలో గడప గడపకూ వెళ్లే ధైర్యం టీడీపీ నేతలకు లేదని, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటి కూడా వారు అందించలేదని మంత్రి అంబటి అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్నామని, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకుంటున్నామని వెల్లడించారు. ఏపీలో మాకు ఓటు వేయని వారికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ నేతలు అమరావతి దగ్గర భూములు కొన్నారని, వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలన కంటే ఎన్నో రెట్లు గొప్పగా సీఎం జగన్ పరిపాలిస్తున్నారని, ఇచ్చిన హామీలలో 95శాతం అమలు చేశారని మంత్రి అంబటి రాంబాబు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY







































