సెప్టెంబర్ లో రూ.1,47,686 కోట్ల జీఎస్టీ వసూళ్లు, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 26 శాతం ఎక్కువ

GST Collection Of Rs 147686 Crore In Sep, 26% Higher Than Last Year, GST Collection, Mango News, Mango News Telugu, GST Collection, GST Collection Latest News And Updates, India's Gross Goods And Services Tax , GST, 26% Higher Than A Year Ago, Government Collects Rs 147686 Cr GST , GST Collections, September GST Collection, Gst Collections Rise 26%, GST Collections In September , Monthly GST Revenue, GST Collections Cross Rs 1.4 Lakh Crore

దేశంలో సెప్టెంబర్ నెలలో రూ.1,47,686 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇలా వరుసగా ఏడు నెలల్లో రూ.1.40 లక్షల కోట్లకు పైగానే జీఎస్టీ వసూళ్ల సేకరణ జరిగిందని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు సెప్టెంబర్ 2022లో నమోదైన జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ 2021 కంటే 26% ఎక్కువని పేర్కొన్నారు. సెప్టెంబర్ లో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 39% ఎక్కువగా ఉన్నాయని మరియు దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ద్వారా వచ్చే ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 22% ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

సెప్టెంబర్ లో సీజీఎస్టీ వసూళ్లు రూ.25,271 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.31,813 కోట్లు, ఐజీఎస్టీ రూ.80,464 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.41,215 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.10,137 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ.856 కోట్లతో కలిపి) గా నమోదయ్యాయి. ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.31,880 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.27,403 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత సెప్టెంబర్ 2022 నెలలో కేంద్రం మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ. 57,151 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.59,216 కోట్లుగా ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో రూ.21,403 కోట్లు, కర్ణాటకలో రూ.9,760 కోట్లు, గుజరాత్ లో రూ.9,020 కోట్లు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జీఎస్టీ వసూళ్లు (రూ.2,595 కోట్లు) పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ లో (రూ.3,132 కోట్లు) 21 శాతం పెరిగాయి. అలాగే తెలంగాణలో 2022 సెప్టెంబర్ లో రూ.3,494 కోట్లు వసూలు కాగా, 2022 సెప్టెంబర్ లో 12 శాతం పెరుగుదలతో రూ.3,915 కోట్లు వసూలు అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 4 =