హైదరాబాద్‌లో ‘అల్లు స్టూడియోస్‌’ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి, హాజరైన అల్లు అర్జున్

Mega Star Chiranjeevi Launches Allu Studios on the Occasion of Allu Ramalingaiah's 100th Birth Anniversary Today at Hyderabad, Megastar Chiranjeevi launched Allu Studios Hyderabad , Allu Studios Hyderabad, Allu Arjun Attended Studio Opening, Chiranjeevi Allu Studios Opening, Allu Studios Opening Hyderabad, Mango News, Mango News Telugu, Megastar Chiranjeevi, Allu Studios, Allu Arjun Latest News And Updates, Allu Studios Grand Launch, Allu Studios Launch Live News And Updates, Chiranjeevi Launches Allu Studios, Allu Ramalingaiah 100th Birth Aniversary, Allu Ramalingaiah Wiki, Geetha Arts

దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్ శివార్లలోని కోకా పేట్‌లో 10 ఎకరాల సువిశాల స్థలంలో ‘అల్లు స్టూడియోస్’‏ను నెలకొల్పారు. శనివారం అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ, చిరంజీవి దంపతులు హాజరయ్యారు. ఈ క్రమంలో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖలు అల్లు రామలింగయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య గారి లాంటి గొప్ప నటుడి కుటుంబంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన కుమారుడు అరవింద్ ఇప్పటికే అగ్ర నిర్మాతగా ఉన్నాడని, ఇప్పుడు ఆయన మనుమలు కూడా చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ మంచి గుర్తింపు పొందారని అన్నారు. అల్లు అరవింద్ ఈ స్టూడియోను లాభాపేక్షతో నిర్మించలేదని, రాబోయే తరాలు అల్లు రామలింగయ్యను స్మరించుకునేందుకు ఆయన పేరు మీద స్టూడియోస్ నిర్మించారని వెల్లడించారు.

అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలని, మాపై అభిమానాన్ని చూపిస్తున్న మెగాభిమానులకు కృతజ్ఞతలని అన్నారు. స్టూడియో ఉండాలనేది మా తాతగారు అల్లు రామలింగయ్య గారి కోరికని, అందుకే ఈరోజు దీనిని నిర్మించటానికి తమ ఫ్యామిలీ నిర్ణయించుకుందని తెలిపారు. మా తాతగారు చనిపోయి 18 ఏళ్లయిందని, అయినా అభిమానులు ఇంకా ఆయనను తలచుకోవడం తమకు ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్ కూడా ఆయన గురించి తెలియజేయడానికి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్ధం ఈ స్టూడియోను నిర్మించడం తమ బాధ్యతగా భావించామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here