ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 56 బీసీ కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు

AP Govt Extends Tenure of Chairmans And Directors of 56 BC Corporations till Further Orders,Key Decision Of Ap Govt, Extension Of Tenure,56 Bc Corporations,Chairmen And Directors,Mango News,Mango News Telugu,Ap Govt Extension Of Tenure,Ap Govt Extension,Bc Corporations,Bc Corporations Latest News And Updates,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఛైర్మన్లు, డైరెక్టర్లు ఆయా పదవుల్లో కొనసాగుతారని తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ముందుగా రాష్ట్రంలోని మొత్తం 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ కార్పోరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వేగంగా అందేందుకు ఈ కార్పోరేషన్లు సహకరించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో బీసీ కార్పోరేషన్‌కు ఒక చైర్మన్‌తో పాటుగా 12 మంది డైరెక్టర్లను నియమించారు. 2020, డిసెంబర్ 17న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీ సంక్రాంతి పేరుతో నిర్వహించిన సభలో ఏపీ ముఖ్యమం‍త్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ లు, వాటికీ సంబంధించిన 672 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా 56 బీసీ కార్పోరేషన్లకు సంబంధించి ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 5 =