ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:
- వైఎస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం
- సెప్టెంబర్ 11న వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభం, నాలుగేళ్లలో డ్వాక్రా మహిళలకు 27వేల కోట్లకుపైగా లబ్ధి
- నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం, 2020 నుంచి 2023 వరకు ఈ విధానం అమలు
- సెప్టెంబర్ 1న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం, రూ. 1863 కోట్లు కేటాయింపు
- సెప్టెంబర్ 5న వైఎస్ఆర్ విద్యాకానుక పథకం ప్రారంభం, 43 లక్షలకు పైగా విద్యార్థులకు అందజేత
- డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీ, 9260 వాహనాలు వినియోగం
- పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్ ఆమోదం
- వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎలక్ట్రానికి పార్క్ ఏర్పాటు
- ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ కంట్రోల్ యాక్ట్ ఏర్పాటు
- అపెక్స్ కౌన్సిల్ భేటీపై చర్చ
- గోదావరి జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలపై చర్చ
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu