తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు (గురువారం) నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈరోజు విశాఖపట్నం లోని కోర్టు పనులు ముగించుకున్న తర్వాత లోకేష్ నర్సీపట్నం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అయ్యన్న ఇంటికి వచ్చిన లోకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో కలిసి భోజనం చేశారు. కాగా, సీఎం జగన్ ను దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో లోకేష్ ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. లోపాలను ఎత్తిచూపుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అయ్యన్న కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని నారా లోకేష్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ