ఉక్రెయిన్ లోని తెలంగాణ విద్యార్థులందరినీ క్షేమంగా రప్పిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay Writes a Letter to Ministry of External Affairs over Telangana Students Situation in Ukraine, Bandi Sanjay Writes a Letter to Ministry of External Affairs, Telangana Students Situation in Ukraine, Ministry of External Affairs, Bandi Sanjay, Bandi Sanjay wrote a letter to External Affairs Minister, Russia-Ukraine war, Russia-Ukraine war Latest News, Russia-Ukraine war Latest Updates, Russia-Ukraine, Russia, Ukraine, External Affairs, Telangana Students, Telangana Students Situation, Telangana Bjp Chief Bandi Sanjay, Bjp Chief Bandi Sanjay, Bharatiya Janata Party, BJP, Mango News, Mango News Telugu, Telangana Students in Ukraine, Telangana,

ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చర్యను ప్రకటించించడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. కాగా ఈ పరిస్థితుల్లో పలువురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కూడా ఉక్రెయిన్‌ లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ, ఉక్రెయిన్ లోని తెలంగాణ విద్యార్థులందరినీ క్షేమంగా రప్పిస్తామని తెలిపారు. విద్యార్థులందరినీ స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతుందని బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉక్రెయిన్ లో ఉన్నారు?, ఎంతమంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ అంశంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశానని తెలిపారు. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య శాంతి మార్గాన్ని మాత్రమే భారత్ కోరుకుంటుందన్నారు. భారత్ అన్ని దేశాలలోని సత్సంబంధాలను కోరుకుంటుందని చెప్పారు. ఉక్రెయిన్ లో భారతీయ ప్రజలను, విద్యార్థులను క్షేమంగా దేశానికి తరలించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + seven =