కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. “లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ ఏడాది ఇసుక సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే, తాజాగా లాక్‌డౌన్ వలన పూట గడవని దుర్భర జీవితం గడుపుతున్నారు. నూతన ఇసుక విధానం వలన ఉపాధి లేక, కుటుంబాలను పోషించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో కలచి వేసింది. ఇప్పుడు లాక్‌డౌన్ వారిని మరింత దెబ్బతీసింది. కార్మికులకు అందుబాటులో ఉన్న 1900 కోట్ల బిల్డింగ్ సెస్ వారి సంక్షేమానికే ఖర్చు చేయాలి. భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయిల ఆర్థిక సహాయం, చంద్రన్న భీమాను పునరుద్ధరించటంతో పాటు వారి జీవన భవిష్యత్తు కు ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని” నారా లోకేష్ కోరారు.
లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో 50లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ ఏడాది ఇసుక సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజా లాక్ డౌన్ వల్ల పుట గడవని దుర్భర జీవితం గడుపుతున్నారు.(1/3) pic.twitter.com/gkCicmCsrN
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) April 25, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu