ఆంధ్రప్రదేశ్‌లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండాకు సెల్యూట్ చేసి వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
[subscribe]
[youtube_video videoid=t5wvxvxA47M]