3 రాజధానులు వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

3 Capitals Issue, 3 capitals issue in andhra pradesh, andhra pradesh 3 capitals bill, AP 3 Capitals Issue, AP Govt Petition on 3 Capitals Issue, Supreme Court, Supreme Court Refuses to hear AP Govt Petition

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టంపై ఏపీ హైకోర్టు విధించిన స్టేటస్ కో ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్ ను ఈ రోజు తోసిపుచ్చింది. రాష్ట్ర హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతుందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. 3 రాజధానులు వ్యవహారంపై గురువారం నాడు హైకోర్టులో విచారణ ఉన్నందువలన తమ వద్దకు రావడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

మరోవైపు పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టంపై ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ లపై దాఖలైన పలు పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించి ముందుగా ఆగస్టు 14 వరకు స్టేటస్ కో విధించింది. ఆతర్వాత ఆగస్టు 14 న విచారణలో భాగంగా తదుపరి విచారణను ఆగస్టు 27కు వాయిదా వేస్తూ, రాజధాని తరలింపు విషయంలో ఆగస్టు 27 వరకు యథాతథ స్థితిని (స్టేటస్‌ కో) అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu