టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని పరామర్శించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నారా లోకేష్ పర్యటనకు పోలీసులు ముందుగానే అనుమతి నిరాకరించారు. దీంతో ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న నారా లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్దనే లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల వాహనాన్ని అడ్డుకోబోయిన పలువురు టీడీపీ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నారా లోకేష్ ను పోలీసుల ఏ స్టేషన్ కు తరలిస్తున్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ