పవన్‌ పోటీ చేయకపోతే ఆ సీటు వారిదే

Balijala eye on Tirupati ticket,Pawan contest, Jagan, Congress, TDP, YCP, BJP, Jana Sena,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Balijala eye on Tirupati ticket,Pawan contest, Jagan, Congress, TDP, YCP, BJP, Jana Sena

ఏపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో…ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. ప్రజారాజ్యం పార్టీ, తెలుగు దేశం పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూ .. ఎప్పటికప్పుడు పార్టీ బలమెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.కొద్ది రోజులుగా పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ అక్కడ ఎప్పటినుంచో తిరుపతి సీటుపై కన్నేసిన బలిజలు ..తిరుపతి టికెట్ తమకే ఇవ్వాలని అందులోనూ స్థానికంగా ఉన్న బలిజలకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే పవన్ ఈ సీటును కోరుకున్నారంటూ వార్తలు రావడంతో బలిజ సామాజిక వర్గం ఓ అడుగు వెనుకకు వేసి..పవన్ పోటీ చేస్తే మాత్రం ఓకే అంటుండటం హాట్ టాపిక్ అయింది.

ఆధ్యాత్మిక నగరం తిరుపతి అసెంబ్లీ టికెట్‌ టీడీపీ,జనసేన పొత్తులో భాగంగా.. జనసేనకే కేటాయిస్తారనే చర్చ రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. అయితే తిరుపతి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌  పోటీ చేసే అవకాశముందని, అందుకే  ఆయన తిరుపతిపై ఫోకస్‌ చేశారని ప్రచారం జోరుగా జరుగుతోంది.ఒకవేళ పవన్‌ కనుక తిరుపతి నుంచి పోటీ చేయకపోతే మాత్రం..ఈ  టికెట్‌ తప్పకుండా బలిజలకే అని జనసేన హై కమాండ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన.. అన్న చిరంజీవి పరపతిని పెంచిన తిరుపతి ఇప్పుడు తమ్ముడిని అక్కున చేర్చుకుంటుందని జనసేన వర్గాలు  భావిస్తున్నాయి.అందుకే  పవన్ అక్కడ పోటీ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తోంది. అందులోనూ అక్కడ బలిజ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండటం ఇప్పుడు పవన్‌కు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది.

అయితే తిరుపతి టికెట్  పవన్‌కు ఇస్తే ఓకేనని బలిజ సంఘాలు చెప్పేయడంతో.. జనసేనాని పోటీకి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తారన్న ప్రచారంపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా బలమైన అభ్యర్థి కోసం మాత్రం జనసేన కసరత్తు చేస్తుందన్న వార్తలు వినిపించాయి.

తిరుపతిలో ఉన్న బలిజ నేతలను పిలిపించి మాట్లాడిన జనసేన పార్టీ హై కమాండ్..తెలుగు దేశం పార్టీకి చెందిన బలమైన బలిజ నేతలతో కూడా సమావేశం అవుతోంది. అలాగే పవన్ పోటీ చేస్తే ఎలా ఉంటుందని వారిని అడిగి తెలుసుకుంటోంది.  తిరుపతి టికెట్ రేసులో ఉన్న తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు మరికొందరు ఆశావాహులను ఆ పార్టీ హైకమాండ్ పిలిపించి.. తిరుపతి టికెట్ పవన్‌కేనని స్పష్టం కూడా చేసినట్లు తెలుస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి  స్వర్గీయ నందమూరి  తారక రామారావు, చిరంజీవి లాంటి సినీ సెలబ్రెటీలను అసెంబ్లీకి పంపిన తిరుపతి.. ఇప్పుడు పవన్ ను కూడా అసెంబ్లీకి  పంపిస్తుందన్న  ప్రచారం అక్కడ జోరందుకుంది. పొత్తులపై దాదాపు క్లారిటీ రావడంతో వైసీపీ అభ్యర్థికి ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారని తెలుస్తోంది. ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి నుంచి పవన్‌ను పోటీ చేస్తే బాగుంటుందని ఇటు  టీడీపీ హై కమాండ్ కూడా కోరుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.

2009లో ప్రజారాజ్యం  పార్టీ నుంచి చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలవడం పవన్‌కు కలసి వచ్చే అంశంగా మారుతోంది.  మరోవైపు బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న తిరుపతిలో పవన్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందన్న అభిప్రాయం కూటమిలో ఉంది. తిరుపతిలో తాజాగా జరిగిన బలిజ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామనే చర్చ నడిచినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 11 =