గుంటూరులో గంజాయి దందా.. తెర వెనుక చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతలు..

The Ruling Party Leaders Are Turning The Wheel Behind The Scenes.., Ruling Party Leaders Are Turning The Wheel, Turning The Wheel Behind The Scenes, Ruling Party Leaders, Guntur, Guntur Issues, AP, AP Elections, Guntur Political News, Guntur News, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
guntur, guntur issues, ap, ap elections

గుంటూరు.. చారిత్రాత్మక నగరం.. ఇక్కడి మిర్చి దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఆసియాలోనే అతిపెద్ద మిర్చియార్డ్ ఇక్కడే ఉంది. కానీ కొందరు ప్రజాప్రతినిధులు గుంటూరు ఖ్యాతికి మచ్చ తీసుకొస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. మిర్చి వ్యాపారానికి కేంద్రంగా ఉన్న గుంటూరును.. గంజాయి, మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసైగల్లో.. యదేచ్ఛగా మాదకద్రవ్యాల రవాణా కొనసాగుతోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు. అమాయకులను.. కాలేజీకి వెళ్లాల్సిన విద్యార్థులను మత్తు అనే ఊబిలోకి లాగుతున్నారు. వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

గుంటూరులో గంజాయి దందా అధికార పార్టీ నేతల ఆధీనంలోనే జరుగుతోందని ముందు నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి.  గంజాయి ఇతర మత్తు పదార్థాలు వారి కనుసైగల్లోనే రవాణా అవుతాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే దగ్గరి బంధువు, ఆయనకు అత్యంత సన్నిహితులు గంజాయి సరఫరా చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టబుడ్డారు. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో.. పోలీసులు ఒత్తిడికి తలొగ్గారు. పట్టుబడిన వారిని గంజాయి కేసులో కేవలం బాధితులుగానే చేర్చి నేర తీవ్రతను తగ్గించారనే ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా నిషేధంలోవున్న గుట్కాను స్వయంగా తయారు చేసి మార్కెట్ చేశారనే ఆరోపణలు కూడా వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్నాయి. గతంలో ఆ ఎమ్మెల్యేకు చెందిన గోదాంలపై పోలీసులు దాడులు చేసి గుట్కా తయారీ మిషన్‌లను సీజ్ చేశారు. అయితే ఆ గోదాంలను తాను లీజ్‌కు ఇచ్చానని.. అందులో ఏం జరుగుతుంతో తనకు తెలియదని అప్పట్లో సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే . ఆ తర్వాత ఆ వ్యవహారం కంచికి చేరింది. ఇక ఇప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేకు చెందిన గోదాం అడ్డాగా.. గుంటూరులో గంజాయి, మత్తు పదార్థాల రవాణా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.  అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో.. పోలీసులు కూడా వారిని పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.

గుంటూరు ఖ్యాతికి మచ్చ తీసుకురావడం.. విద్యార్థులు, యువతను గంజాయికి, మత్తు పదార్థాలకు బానిసలను చేయడంపై పెమ్మసాని చంద్రశేఖర్ తన గలం వినిపిస్తున్నాయి. గుంటూరును గంజాయి రహిత నగరంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు పెమ్మసాని ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా విద్యా రంగానికి పెమ్మసాని పెద్దపీఠ వేసి.. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించేందుకు నడుం బిగించారు. యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY