కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. తుఫాన్‌ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఏడుగురు దుర్మరణం

Seven People Lost Lives and Five Severely Injured in Fatal Accident Near Chitravathi Bridge Kadapa District,Fatal Accident Near Chitravathi Bridge,Seven People Lost Lives,Five Severely Injured,Fatal Accident Near Chitravathi Bridge Kadapa District,Mango News,Mango News Telugu,Fatal Accident In Kadapa District,Fatal road accident in Kadapa district,Seven killed, five injured in fatal road accident,Fatal Accident Latest News And Updates,Kadapa Latest News And Updates

వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా కొండాపురం మండలం ఏటూరు సమీపంలోని చిత్రావతి వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తున్న తూఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తుఫాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు సహాయక చర్యలు ప్రారంభించారు. 108కి కాల్ చేసి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సమీపంలో వంతెన ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా సీఐ సుదర్శన్ ప్రసాద్, ఎస్ఐ సత్యనారాయణ తదితరులు సిబ్బందితో కలిసి చర్యలు తీసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులు తిరుమలకు వెళ్లారు. స్వామిని దర్శించుకున్న అనంతరం వారందరూ తుఫాన్‌ వాహనంలో స్వగ్రామాలకు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో వారి వాహనం, ఎదురుగా వస్తున్న లారీ ప్రమాదవశాత్తూ ఢీ కొట్టుకున్నాయి. కాగా మృతులను తాడిపత్రి వాసులుగా గుర్తించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు సీఐ సుదర్శన్ ప్రసాద్ వెల్లడించారు. అయితే ఏ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అతివేగం లేదా డ్రైవర్ల నిద్రమత్తు కారణం కావొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. కాగా ప్రమాద ఘటనపై ఏపీ గవర్నర్ సయ్యద్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 11 =