కొలిక్కివచ్చిన బీజేపీ సీట్ల లెక్కలు

seats that BJP is seeking in AP,Calculations of BJP seats ,YCP,BJP, TDP, Jagan , Chandrababu, Delhi Bjp,Vijayanagaram,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
seats that BJP is seeking in AP,Calculations of BJP seats ,YCP,BJP, TDP, Jagan , Chandrababu, Delhi Bjp

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల  వ్యూహంపై కసరత్తులు చేస్తున్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ .. ప్రచారానికి కూడా సిద్ధం అయిపోయింది. ఇటు ప్రచారాలపై రెండు పార్టీలు ఫోకస్ పెంచుతున్నా కూడా.. టీడీపీ,జనసేన కూటమి బీజేపీతో పొత్తు వల్ల ఇంకా సీట్ల సర్ధుబాట్ల చర్చల దగ్గరే  ఉండిపోయాయి. బీజేపీ ఒక క్లారిటీ ఇచ్చేస్తే అభ్యర్ధులను ప్రకటించి జోరుగా ప్రచారం చేయడానికి టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి.

అయితే తాజాగా టీడీపీ, బీజేపీ పొత్తు విషయంలో  కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాలలో టీడీపీ  పొత్తులపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే చర్చించింది. బీజేపీ పెద్దలు.. ఏపీ వ్యాప్తంగా 20 అసెంబ్లీ స్థానాలపై  దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో ఇటీవల ఢిల్లీలో చర్చలు జరిపిన అమిత్ షా.. బీజేపీకి  రాష్ట్రంలో పట్టున్న అసెంబ్లీ స్థానాల వివరాలను తీసుకుని లిస్ట్ రెడీ చేయాలని ఏపీ బీజేపీ నేతలను ఆదేశించారు.

దీంతో సీట్లపై కసరత్తు చేసిన ఏపీ  బీజేపీ నేతలు.. 20 అసెంబ్లీ స్థానాలతో ఓ లిస్టును రూపొందించి ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు.  దీని ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లా తప్ప.. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పోటీకి  ఆసక్తి చూపించినట్లు  తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 3 స్థానాలు, కృష్ణాలో 2 స్థానాలు, గుంటూరులో 4 స్థానాలు, నెల్లూరులో 2 స్థానాలు, కడపలో 1 స్థానం, చిత్తూరులో 1 స్థానం, పశ్చిమ గోదావరిలో 3 సీట్లను కోరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్క స్థానం చొప్పున పోటీ చేయడానికి బీజేపీ రెడీ అవుతోంది. ఏపీలో ఈ 20 నియోజకవర్గాల పేర్లను సూచిస్తూ.. ఢిల్లీ  పెద్దలకు  ఏపీ బీజేపీ రిపోర్టు పంపింది.దీనిపై మరోసారి చర్చించి చంద్రబాబుతో ఈ విషయంపై రెండు రోజుల్లోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE