ఎలక్టోరల్ బాండ్ల కలెక్షన్లలో ఫస్ట్ ప్లేస్‌లో బీఆర్ఎస్

KCR, BRS, electoral bonds, BJP, Supreme court,Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics,Mango News Telugu, Mango News
KCR, BRS, electoral bonds, BJP, Supreme court

ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశాన్నే కుదిపేస్తోంది. ఎలక్టోరల్ బాండ్ల పథకం అధికార పార్టీకి లాభం చేకూర్చేలా ఉందంటూ దాఖలయని పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసింది. ఇకపై రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించకూడదని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించటం అవినీతిని ప్రోత్సహించినట్లవుతుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ సమయంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏ పార్టీ అధిక విరాళాలు సేకరించిందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రంలో అధికారంలోవున్న బీజేపీ సర్కార్ ఈ ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కలిపి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దాదాపు రూ. 16,500 కోట్ల విరాళాలు సేకరించాయి. అందులో అత్యధికంగా అధికార బీజేపీ విరాళాలు సేకరించింది. రూ. 10 వేల కోట్లకు పైగా విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాషాయపు పార్టీకి అందాయి. మిగిలిన విరాళాలు దేశంలోని ఇతర పార్టీలకు అందాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు సేకరించిన పార్టీగా బీఆర్ఎస్‌ టాప్‌లో ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు సేకరించిన పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది.  గడిచిన ఆరేళ్లలో బీఆర్ఎస్ రూ. 913 కోట్ల విరాళాలను సేకరించింది. ఇందులో రూ. 529 కోట్లను  2022-23 సంవత్సరంలోనే బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళంగా అందాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో బీఆర్ఎస్ వాటా 7.61 శాతంగా ఉంది.

మరోవైపు ఎలక్టోరల్ ట్రస్టుల రూపంలో కూడా బీఆర్ఎస్ భారీగా విరాళాలను సేకరించింది. ఆడిట్ రిపోర్టుల ప్రకారం.. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ. 65 కోట్ల విరాళాలు బీఆర్ఎస్ సేకరించింది. ఎలక్టోరల్ ట్రస్టుల రూపంలో అత్యధిక విరాళాలు సేకరించిన పార్టీల్లో బీఆర్ఎస్ మూడోస్థానంలో ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 13 =