వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనూ ఓడిస్తాం.. గుడివాడ వైసీపీ ప్లీనరీలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

MLA Kodali Nani Sensational Comments on TDP Chief Chandrababu in YSRCP Plenary at Gudivada, Kodali Nani Sensational Comments on TDP Chief Chandrababu in YSRCP Plenary at Gudivada, MLA Kodali Nani Sensational Comments on TDP Chief Chandrababu, YSRCP Plenary at Gudivada, YSRCP Plenary, MLA Kodali Nani Sensational Comments on TDP Chief, Sensational Comments on TDP Chief Chandrababu, MLA Kodali Nani, Kodali Nani, TDP Chief Chandrababu Naidu, TDP Chief Chandrababu, Chandrababu Naidu, Gudivada, YSRCP Plenary News, YSRCP Plenary Latest News, YSRCP Plenary Latest Updates, YSRCP Plenary Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తన సొంత నియోజకవర్గం గుడివాడలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనూ ఓడించి తీరుతామని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు బహిరంగ సభ అంటూ నాలుగు జిల్లాల్లో జన సమీకరణ చేస్తూ, విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నన్ను ఓడిస్తామని బీరాలు పలుకుతున్నారని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గుడివాడలో ఐదోసారి కూడా నా గెలుపుని అడ్డుకోలేరని కొడాలి నాని అన్నారు.

సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీని గెలిపించలేని చంద్రబాబు గుడివాడలో పార్టీని ఏం గెలిపిస్తారని, ఒకవేళ ఆయనకు అంతగా కావాలనుకుంటే నాపైనే పోటీ చేయొచ్చని కొడాలి నాని సవాల్ విసిరారు. మంత్రి పదవి లేకపోవడం వల్ల నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. మంత్రులుగా ఉన్నవాళ్లు ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు సమాధానం చెబుతారు. ఎవరైనా పార్టీపై విమర్శలు చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో కాశపడుతున్నారని, మూడేళ్ల లోనే రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. ఇక 75% హాజరు ఉన్న ప్రతి విద్యార్ధికి అమ్మ ఒడి పథకం కింద సాయం అందిస్తున్నామని, స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ నిర్వహణకోసం రూ. 2 వేలు కట్ చేసి మిగిలిన రూ. 13 వేలు ఇస్తున్నామని, అందులో తప్పేముందని కొడాలి నాని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here