విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ లీకేజీ ఘటనపై అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాగా ప్రభుత్వం నియమించిన ఈ హైపవర్ కమిటీ గ్యాస్ లీకేజి ఘటనపై తుది నివేదికను ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించింది. హైపవర్ కమిటీ సభ్యులు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను కలుసుకుని తుది నివేదికను సమర్పించారు.
ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి గ్యాస్ లీకైన తీరు, భవిష్యత్తులో ప్రమాదాలు మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలను హైపవర్ కమిటీ తుది నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రతి అంశాన్ని ఈ కమిటీ నిశితంగా పరిశీలించింది. గ్యాస్ లీకేజి వలన ప్రభావితమైన గ్రామాలలోని ప్రజలు, పర్యావరణ, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలు, పలువురి నాయకులు, జర్నలిస్ట్‌లు, సంబంధిత అధికారులతో హైపవర్ కమిటీ కీలకంగా చర్చించి, పూర్తీ సమాచారంతో తుదినివేదికను రూపొందించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu









































