అంగన్వాడీలకు సంబంధించి కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

Govt key Instructions to Collectors Regarding Anganwadis, Collectors Regarding Anganwadis, Instructions to Collectors, Regarding Anganwadis key Instructions, AP, Anganvaadies, CM Jagan, YCP Government, Latest AP Anganwadis News, AP Anganwadis News Update, AP Collectors, Andra Pradesh, Political News, Assembly Elections, Mango News, Mango News Telugu
AP, Anganvaadies, CM Jagan, YCP Government

ఏపీలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతంగా మారుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు సమ్మె చేపట్టి నెలరోజులు కావస్తోంది. అటు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అంగన్వాడీలు సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. సమ్మె విరమించాలని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. వెంటనే విధుల్లో చేరకపోతే.. వారిని పూర్తిగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించినప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు పట్టుపట్టుకొని కూర్చున్నారు.

ఈక్రమంలో సమ్మె మొదలు పెట్టి నెల రోజులు కావడంతో అంగన్వాడీలు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే అంగన్వాడీల వ్యవహారం ప్రభుత్వానికి కొరకురాని కొయ్యగా మారింది. ఇప్పుడు చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపునివ్వడంతో.. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలకు మరింత షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది.

ఇప్పటికే సమ్మె విరమించుకొని విధుల్లో చేరాలని ప్రభుత్వం అంగన్వాడీలకు సూచించింది. వెంటనే విధుల్లో చేరని వారిని పూర్తిగా విధుల నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గడం లేదు. ఈక్రమంలో అంగన్వాడీల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆదివారం కలెక్టర్లతో రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పలు సూచలను చేసింది. తొలగింపు, నియామకం రెండు ఒకేసారి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అంగన్వాడీల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈక్రమంలో విధులకు హాజరు కాని అంగన్వాడీలను తొలగిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. విధుల్లో చేరినవారు తప్పించి మిగతా వారిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జనవరి 25న కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామనిప్రకటించారు. మరి ఇప్పటికైనా అంగన్వాడీలు తమ సమ్మెను విరమించుకుంటారా? లేదా? అనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 5 =