రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటారు. తమ పాలకులు సుపరిపాలన అందించాలని ఆశిస్తారు. స్వార్థ ప్రయోజనాలు లేని.. నిస్వార్థ నాయకుల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చే నాయకులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. సంపాదన కోసం కాకుండా.. సంపాదించిన కోట్ల రూపాయిలను ప్రజల కోసం ఖర్చు చేస్తూ.. జనం సంతోషంలో తన సంతోషాన్ని చూసుకునే రాజకీయ నాయకులు అక్కడక్కడ కనిపిస్తారు. అటువంటి వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరు అంటూ ఏపీలో ప్రచారం జరుగుతోంది.
ప్రజలను ఉద్దరిస్తానంటూ.. వాళ్ల సొమ్మును దోచుకునే నాయకులను ఐదేళ్లుగా ఏపీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో పదవి, అధికారం లేకపోయినా.. ప్రజల కోసం సొంత డబ్బులు ఖర్చు చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఉద్దానం బాధితులు, కౌలు రైతులు. ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందిస్తూ.. వారి జీవితాలకు అండగా నిలిచారు.. ఎప్పటికీ అండగా నిలుస్తామనే భరోసాను ఇచ్చారు.
కుల, మత బేధాలు లేకుండా ప్రజలంతా తన వాళ్లనే భావనతో సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఒక వ్యక్తిగా వందల కోట్ల రూపాయిలను ప్రజల కోసం ఖర్చు చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ ఒక్కరే. ప్రభుత్వంలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన వైసీపీ నాయకులు భూకబ్జాలు, కమీషన్ల పేరిట వేల కోట్ల రూపాయిలు దోచుకుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను ప్రజల కోసం పెడుతున్నారు.
జనసేనాని ఆలోచన ఒక్కటే.. ప్రజలంతా బాగుండాలి.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. ఒక వ్యక్తి కంటే వ్యవస్థ ద్వారా ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చనే ధృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. సగటు పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. ప్రజలు పన్నుల రూపంలో కట్టే ప్రతి రూపాయిని ప్రజల కోసం ఎలా ఖర్చు చేయాలో పూర్తి అవగాహన కలిగిన నాయకులు పవన్.
ముఖ్యంగా అవినీతి అంటే సహించని వ్యక్తిత్వం. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందించినప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని విశ్వసించే వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే తన ఆలోచనలు, ఆశయాలు నెరవేరాలంటే ఆయన వ్యవస్థలో ఉండాలన్న వాదన వినిపిస్తోంది. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు అధికారం కావాలి. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉంటే.. ప్రజలు నిజమైన అభివృద్ధిని చూస్తారు. మాట్లాడే మాటల్లో కల్మషం ఉండదు. చేసే ప్రతి పనిలో స్వార్థం ఉండదు. ఇలాంటి నాయకులు ఎవరున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
పేద ప్రజల ఆదాయం పెరగాలంటే ఉపాధి అవకాశాలు కల్పించాలి. నాణ్యమైన విద్యను వైద్యాన్ని అందించాలి. దళారీ విధానం పోవాలి. ప్రకృతి సంపదను దోచుకునే అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలి. ఇవ్వన్ని జరగాలంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండాలని కోరుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY