డిసెంబర్‌లోపే నేను విశాఖ పట్టణంకు షిప్ట్ అవుతా. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఈ మేరకు పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీకి మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. అమరావతే రాజధానిగా ఉండాలని ఓ ప్రాంత ప్రజలు పోరాడుతూనే ఉన్న వేళ జగన్ తీసుకున్న నిర్ణయం కొన్ని జిల్లాల్లో ప్రభావం చూపనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలో విశాఖ పట్టణం పెద్ద నగరం. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా తయారైంది. హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు. మరి అమరావతి పరిస్థితేంటి.. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగతాయా.. లేదా అనే సందిగ్దం ఏర్పడుతోంది. ఈ క్రమంలో రాజధానిపై ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కనుంది. ముఖ్యమంత్రి జగన్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీలో కొంత డైలమా పరిస్థితి కనిపిస్తోంది. జనసేనాని పవన్ తన వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ నేతలకు ఎన్నికల కార్యాచరణ దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి తాజాగా విశాఖ కేంద్రంగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. పరిపాలనకు సంబంధించి ఆసక్తి కర ప్రకటన చేసారు. ఇటీవలే విశాఖ ఐటీహిల్ నంబర్2 వద్ద నూతనంగా నిర్మించిన ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని పరిశీలించి.. ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముచ్చటించారు. పరవాడ, అచ్యుతాపురం సెజ్‌లలో ఫార్మా యూనిట్లను ప్రారంభించనున్నారు.
హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే విశాఖ అతిపెద్ద నగరంగా పేర్కొన్నారు. ఇన్ఫోసి కంపెనీ అడుగు పెట్టడంతో ఏపి ఐటి భవిష్యత్తుకు ఒక మంచి సంకేతమన్నారు. మరిన్ని ప్రఖ్యాత ఐటి కంపెనీలు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ నుంచే మొత్తం పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కలలను సాకారం చేసుకోడానికి విశాఖపట్నం ఒక గమ్యస్ధానమని వివరించారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా తయారైందని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తాని ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. వైజాగ్‌లో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే.. ఈ మొత్తం వ్యవహారంతో ఉత్తరాంధ్ర లో వైసీపీకి కలిసి వచ్చినా.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతికూల పవనాలు వీచే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఏడాదిలోనే ఏపీ కూడా ఎన్నికలకు వెళ్లనుంది. ఈసారి 175కు 175 గెలిచి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ చేస్తామని ప్రకటనలు ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు ఇటువంటి సమయంలో.. విశాఖ నుంచే మొత్తం పాలన సాగిస్తామని చెప్పడం.. షిప్ట్ అవుతుండడం కరెక్టేనా.. అని వైసీపీలో కూడా చర్చ జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ