భారతదేశంలో ‘నిరుద్యోగ రేటు’ పెరుగుతోంది: సర్వే

Are the job opportunities for educated people decreasing in India,Are the job opportunities decreasing,opportunities for educated people decreasing,job opportunities decreasing in India,Mango News,Mango News Telugu,Indias jobs crisis,India job opportunities,across sectors, CAGR, Domestic helpers, in India, job opportunities, Real wage growth, Self Employed, unemployment rate,India job opportunities Latest News,India job opportunities Latest Updates,India job opportunities Live News,Indias jobs crisis Latest News,Indias jobs crisis Latest Updates
Self Employed,Domestic helpers,Real wage growth ,across sectors,CAGR, job opportunities, in India, unemployment rate,

భారతదేశంలోని ఉన్నత విద్యావంతులలో.. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారి సంఖ్య ఎక్కువ అవుతుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తాజా నివేదిక వెల్లడించింది. డిగ్రీలు లేదా డిప్లొమాలు ఉన్నవారిలో నిరుద్యోగ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తేల్చింది.

అలాగే మనీ కంట్రోల్ వెల్లడించిన నివేదిక ప్రకారం..ఈ  ఐదేళ్లలో ఉద్యోగాల తక్కువ పురోగతి ఉందని సర్వే వెల్లడించింది. అలా ఉద్యోగావకాశాలకు, ఉద్యోగార్ధులకు మధ్య గణనీయమైన తేడా ఉందని తేలింది. ఈ అంతరం మెరుగుపడటానికి ఇంకొంత సమయం పట్టవచ్చని సర్వే తెలిపింది.

ప్రధానంగా ఈ తేడా డిప్లొమా హోల్డర్లలోనే ఎక్కువ నిరుద్యోగం రేటు జూన్ 2023కి 12.1 శాతంగా ఉన్నట్లు సర్వ పేర్కొంది.  అయితే గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు 13.4 పర్సంట్ ఉండగా పోస్ట్ గ్రాడ్యుయేట్లలో 12.1 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. 2018 నుంచి  2023 వరకు నిరుద్యోగం రేటు బాగా పడిపోయినట్లు వార్షిక లేబర్ ఫోర్స్ సర్వే గుర్తించింది.  అయినా కూడా, కొత్త ఉద్యోగాలు సృష్టించడం కోసం,  స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం, జీతం తీసుకునే ఉద్యోగుల సంఖ్యా  గణనీయంగా తగ్గిపోయింది.  అంటే పని నాణ్యతను సృష్టించడంలో.. ఘోరంగా విఫలమైంది.

మరోవైపు కరోనా మహమ్మారి సమయంలో దేశంలో.. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పొందుతున్న వారి సంఖ్య.. 510 బేసిస్ పాయింట్లు పెరగగా.. డొమస్టిక్ హెల్పర్స్ 470 బేసిస్ పాయింట్లు పెరిగినట్లు సర్వే వెల్లడించింది. ఈ ఐదేళ్లలో వ్యవసాయం, వాణిజ్యం,  ట్రాన్స్‌పోర్ట్ రంగాలు స్వయం ఉపాధిలో.. గణనీయమైన పెరుగుదలను చూపించినట్లు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఈ గణనీయమైన పెరుగుదలలో గ్రామీణ మహిళల భాగస్వామ్యంతో పాటు ఉపాధిలో పెరుగుదల కనిపించినట్లు తెలిపింది.

అలాగే రియల్ వేజ్ గ్రోత్  వృద్ధి సెక్టార్లలో అస్థిరంగా ఉంది.  ఇది రియల్ వేజ్ గ్రోత్  వృద్ధి  వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నివేదిక చెబుతోంది. జీతాలు పొందే కార్మికుల వార్షిక వేతనాలు 3.4 శాతం   కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వద్ద పెరిగినట్లు తేలింది. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్  పొందిన వ్యక్తులు 2018 నుంచి 2023 వరకు ..మొత్తం ఆదాయాలలో 1.8 పర్సంట్   కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పెరుగుదలను నివేదించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eight =