అనకాపల్లిలో స్థానాలు మారే ఛాన్స్ ఉందా?

Pawan, Konatala Ramakrishna, Anakapalli, Pawan Kalyan, Peela Govind, Chandra Babu, TDP, Janasena, YCP,Jagan, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu, Mango News
Pawan, Konatala Ramakrishna, Anakapalli, PaWan Kalyan, Peela Govind, Chandra Babu, TDP, Janasena, YCP,Jagan

ఏపీలో టీడీపీ,  జనసేన కూటమిలో భాగంగా..జనసేన పార్టీ 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయబోతోంది. అయితే ఒకేసారి 24 అసెంబ్లీ స్థానాలను ఒకేసారి ప్రకటించకుండా.. తొలి జాబితాలో ఐదు అసెంబ్లీ స్థానాలకు బరిలోకి దిగబోయే అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి అయిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు.

కొణతాల గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా పని చేశారు. ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో  తొలిసారిగా గెలిచిన కొణతాల.. ఆ తర్వాత రాజకీయంగా ఎలాంటి పవర్ లేక  నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే జనసేనలో చేరిన ఆయనకు పవన్ కళ్యాణ్ తొలి జాబితాలోనే అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కేటాయించినా..త్వరలోనే ఆ సీటు మారుస్తారన్న వార్త వినిపిస్తోంది.ఇటు అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ బలమైన నేతగా ఉన్నారు.

పైగా ఆయన కొణతాల రామకృష్ణకు బంధువు అవుతారు. అనకాపల్లి అసెంబ్లీ బరిలో జనసేనతో పొత్తు ఉన్నా.. లేకపోయినా.. ఎలా పోటీ చేసినా కూడా ఆయన గెలుస్తారన్న చర్చ స్థానికంగా నడుస్తోంది. దీంతో ఇక్కడ  కొణతాల పోటీ చేస్తే.. పీలా గోవింద్ తన సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి. దీంతో బంధువులైన  వారిద్దరూ ఒక రాజకీయ ఒప్పందానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

కొణతాల అనకాపల్లి పార్లమెంటు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే.. పీలా గోవింద్ అనకాపల్లి నుంచి టీడీపీ అభ్యర్ధిగా అసెంబ్లీకి పోటీ చేసేలా..  ఆ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని వార్తలు వినిపిస్తున్నాయి. అలా అయితే వారి కుటుంబంలోనే ఒక ఎంపీ.. ఒక ఎమ్మెల్యే పదవి దక్కుతుందని వీరిద్దరూ ప్లాన్ చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. పైగా జనసేన పోటీ చేసే కాకినాడ,మచిలీపట్నం పార్లమెంటు స్థానాల్లో కాపు నేతలు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు.

మరోవైపు కొణతాల రామకృష్ణ అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తే..ఒక బీసీ నేత కూడా జనసేన పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేసినట్టు ఉంటుంది. ఈ ఈక్వేషన్ తోనే కొణతాల , పీలా గోవింద్ ఇద్దరు తమలో ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామనే ప్రతిపాదనను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టినట్టు తెలుస్తోంది. కానీ దీనిపై చంద్రబాబు, పవన్ ఏం చెప్పారో అన్న విషయంపై ఎలాంటి సమాచారం లేదు.

ఒకవేళ కొణతాల, పీలా గోవింద్ అనుకున్నదే కనుక జరిగితే అనకాపల్లి అసెంబ్లీ బరిలో ఉన్న రామకృష్ణ.. అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేస్తారు. అయితే రెండు రోజులుగా  పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానంతో పాటు.. అనకాపల్లి స్థానం నుంచి పార్లమెంటుకు కూడా పోటీ చేస్తారని మరో ప్రచారం ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ కనుక అక్కడ నుంచి పోటీ చేస్తే  కొణతాలకు షాక్ తప్పదు. అప్పుడు అనకాపల్లి నుంచి కచ్చితంగా జనసేన తరఫున అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE