తమ్మినేని జాతకం తిరగబడుతుందా..?

Tammineni,AmudalaValasa, Tammineni Seetharam,Koona Ravi Kumar, Ycp, Tdp,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,andhra pradesh,AP Political updates,Mango News Telugu, Mango News
Tammineni,AmudalaValasa, Tammineni Seetharam,Koona Ravi Kumar, Ycp, Tdp

ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఎక్కడ ఏ అభ్యర్ధికి సీటు వచ్చింది? ఏ పార్టీ తరపున ఎవరు నిలబడుతున్నారు? అసలు ఏ పార్టీకి ఎక్కడ గ్రిప్ ఉందన్న చర్చలే నడుస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో ఏపీ వాసులు ఎవర్ని అధికారంలో కూర్చోబెడతారో అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి. అలా ఉమ్మడి శ్రీకాకుళంలోని ఆమదాలవలస నియోజకవర్గం వైపు అందరి చూపు పడుతోంది. అక్కడ టీడీపీ  అభ్యర్థిగా  కూన రవికుమార్ కు టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

ఇప్పటి వరకూ అంతో ఇంతో నమ్మకం పెట్టుకున్న వైసీపీకి..ఇక్కడ పోరు ఏకపక్షమనే సీన్ కనిపిస్తోంది. కూనకే తమ ఓటు అని..ఆయనే తమకు ఆయన అండగా ఉన్నారనే టాక్  స్థానికుల నోటి వెంట వినడంతో అధికారపార్టీ నేతలు కంగుతింటున్నారట. దీనికి తోడు అక్కడ తమ్మినేనికి వ్యతిరేకత పెరిగిపోయిందని తాజాగా నిర్వహించిన వైసీపీ సర్వేలోనూ వెల్లడవడంతో సీఎం జగన్ కూడా షాక్ అయ్యారట. వైసీపీ అధినేత ఎంత ఆచితూచి వ్యవహరించి ఆయనకు సీటు ఇచ్చినా కూడా ..తమ్మినేని ఓటమిని చవిచూడడం ఖాయమని స్వయానా వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారట.

ఒకవేళ ఆముదాలవలస నియోజకవర్గంలో తమ్మినేనికి టికెట్ ఇవ్వకపోతే.. బీసీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడుతుందని వైసీపీలో మరో చర్చ సాగుతోంది. దీంతో తమ్మినేని సీటు విషయంపై ఇంకా ఎటూ తేలలేదు. అధిష్టానం ఇంకా మల్లగుల్లాల నుంచి బయటపడకముందే.. తమ్మినేని సీతారాం మాత్రం ఆముదావలస సీటు తన కుటుంబానికేనని ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఈ ఎన్నికలలో తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరగా..ఆయన దీనికి ఒప్పుకోలేదు. దీంతో తమ్మినేని సీతారాం తానే పోటీ చేస్తానని అంటున్నారు. అయితే అక్కడ సీటిస్తే ఘోర ఓటమి తప్పదన్న లెక్కలతో వైసీపీ అధినేత ఆలోచనలో పడ్డారట.

ఇక ఇటు ఇద్దరి నేతల బలాబలాల విషయానికి వస్తే.. 2014 ఎన్నికల్లో కూన రవికుమార్‌ తొలిసారి బరిలోకి దిగి విజయం దక్కించుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోయారు. అయినా కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ   ప్రజలకు చేరువ అయి ఇప్పుడు  వారి దగ్గర మంచి మార్కులే వేయించుకున్నారు. ఈ లెక్కలతోనే  కూన రవికుమార్‌కు 2024లోనూ టిడీపీ టికెట్ దక్కించుకున్నారు.

మరోవైపు ఆముదాల వలస  నియోజకవర్గంలో పది సార్లు ఎన్నికలు జరగగా..ఐదుసార్లు తెలుగు దేశం పార్టీ, నాలుగు సార్లు కాంగ్రెస్‌ గెలిచాయి. అయితే 2019 ఎన్నికలలో మాత్రం వైసీపీ గాలి బలంగా వీయడంతో ఆ పార్టీ విజయం సాధించింది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను  పరిశీలిస్తే.. ఒకరకంగా టీడీపీకి ఆముదాల వలస కంచుకోటగానే చెబుతారు విశ్లేషకులు. దీనికి తోడు.. గత ఎన్నికల్లో తమతో పాటు నడిచిన కూన రవికుమార్‌ను గత ఎన్నికలలో ఓడించమన్నా పశ్చాత్తాపం కూడా అక్కడి ఓటర్లలో కనిపిస్తోంది.

కూనపై ఇప్పుడున్న సింపతీ పవనాలకు తోడు.. తమ్మనినే వ్యవహార శైలి, ఆయన దూకుడు వంటివి తమ్మినేని సీతారాం అంటేనే అక్కడి ఓటర్లు మండిపడే పరిస్థితులు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడం.. కూన రవికుమార్ పైన కేసులు పెట్టినా కూడా ఖండించలేదన్న కోపం.. సీతారాం గెలుపునకు మైనస్‌గా మారాయి. దీనికి తోడు ఈ సారి కూన రవికుమార్ గెలిస్తే..కచ్చితంగా చంద్రబాబు కూనకు మంత్రిపదవి ఇస్తారని..నియోజకవర్గం అభివృద్ధికి అది ప్లస్ అవుతుందనే సంకేతాలు అక్కడ వినిపిస్తున్నాయి.  దీంతో ఆముదాల వలసలో సీతారాం నిలబడటం వల్ల వైసీపీకి ఎలాంటి ఉపయోగం లేదని..అది కూనకే కలిసి వస్తుందన్న వాదన వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 13 =