మద్యం ప్రియులకు శుభవార్త, రాత్రి 9 గంటల వరకు ఓపెన్

Andhra Pradesh, AP Liquor Shops, AP Liquor Shops Open, AP News, liquor shops, Liquor Shops In AP, Wine Shops In AP, Wine Shops In AP will Remain Open up to 9 PM, Wine Shops will Open up to 9 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వచ్చాక మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మద్యం దుకాణాలను తెరిచే సమయాన్ని రాత్రి 9 గంటల పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూలై 25, శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలు తెరవనున్నారు. మరోవైపు మద్యపాన నిషేధం హామీలో భాగంగా మద్యం దుకాణాల సంఖ్యను గతంలోనే ప్రభుత్వం 2934కి తగ్గించింది. మొత్తం 33 శాతం దుకాణాలు తగ్గించడంతో మే నెల చివరి నుంచి రాష్ట్రంలో 4380 దుకాణాల్లో కేవలం 2934 దుకాణాలు మాత్రమే తెరుస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu