ఐపీఎల్ 13 వ సీజన్ కి రంగం సిద్ధం, సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో‌ ప్రారంభం

2020, IPL, IPL 2020, IPL 2020 In UAE, IPL 2020 News, IPL 2020 schedule, ipl 2020 schedule new, IPL 2020 set to start on September 19 in UAE, IPL 2020 to be held in UAE, IPL 2020 Updates, UAE

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్ ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదాపడడంతో అదే సమయంలో ఐపీఎల్-2020 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2020‌ సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. యూఏఈలో అబుదాబి, షార్జా మరియు దుబాయ్‌ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ తాజాగా వెల్లడించారు. ఈ లీగ్ 51 రోజుల పాటు జరగనుండగా, ‌ ఫైనల్‌ను నవంబర్‌ 8న నిర్వహించే అవకాశం ఉంది. ఐపీఎల్ లో పాల్గొనే 8 జట్లు ఆగస్టు 20 కల్లా యూఏఈకి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాయి. అయితే ఐపీఎల్-2020 కి సంబంధించి షెడ్యూల్, ఇతర విధివిధానాలు ఇంకా నిర్ణయించాల్సి ఉంది. వచ్చే వారం జరిగే ఐపీఎల్ పాలకమండలిలో చర్చించి, షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. అలాగే ఐపీఎల్ ముగిసాక భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here