వైఎస్సార్సీపీ ఫ్లీనరీ రెండో రోజు కార్యక్రమాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని, గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో వైఎస్సార్సీపీ ఫ్లీనరీ కోలాహలంగా జరుగుతుంది. రెండు రోజుల పార్టీ ఫ్లీనరీకి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా జెడ్పి ఛైర్మన్స్, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ ప్రజా ప్రతినిధులు సహా రాష్ట్ర నలుమూలల నుండి లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. తొలిరోజైన శుక్రవారం నాడు ప్లీనరీలో మహిళా సాధికారత-దిశ చట్టం, విద్యా రంగం, నవరత్నాలు-డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్, వైద్యారోగ్య రంగం వంటి వాటిపై నాలుగు తీర్మానాలు ప్రవేశపెట్టారు.
ఇక రెండో రోజు ప్లీనరీలో భాగంగా పారదర్శక పాలన, సామాజిక సాధికారత, వ్యవసాయ రంగం, పరిశ్రమలు-ఎంఎస్ఎంఈ-ప్రోత్సాహకాలు, దుష్ట చతుష్టయం వంటి అంశాలపై ప్లీనరీ తీర్మానాలు చేయనున్నారు. అలాగే పార్టీ అధ్యక్షడు ఎన్నిక ప్రకటన, పార్టీ రాజ్యాంగ సవరణల ప్రతిపాదన, ఆమోదం ఉండనున్నాయి. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పలు ఇతర అంశాలపై సీఎం వైఎస్ జగన్ చేత ప్లీనరీ ముగింపు సందేశం ఉండనుంది. మరోవైపు రెండో రోజు ప్లీనరీకి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ వాటర్‌ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయడంతో ప్లీనరీ సజావుగా సాగుతుంది. అలాగే ప్లీనరీకి హాజరయిన వారికీ 25 రకాల నోరూరించే వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. సీఎం వైఎస్ జగన్, ప్రజా ప్రతినిధుల నుంచి కార్యకర్త వరకు ఒకే మెనూ ప్రకారం టీఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందిస్తున్నారు.
వైఎస్సార్సీపీ ఫ్లీనరీ రెండో రోజు ఎజెండా/షెడ్యూల్ వివరాలు:
- సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
- పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఇతర ప్రధాన నాయకులకు స్టేజ్ పైకి ఆహ్వానం
- పారదర్శక పాలనపై తీర్మానం
- అనంతరం సామాజిక సాధికారత పై తీర్మానం
- వ్యవసాయంపై తీర్మానం
- సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
- పరిశ్రమలు-ఎంఎస్ఎంఈ-ప్రోత్సాహకాలుపై తీర్మానం
- దుష్ట చతుష్టయంపై తీర్మానం
- పార్టీ అధ్యక్షడు ఎన్నిక ప్రకటన
- పార్టీ రాజ్యాంగ సవరణల ప్రతిపాదన, ఆమోదం
- పార్టీ అధ్యక్షుడికి అభినందన కార్యక్రమం
- పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేత ప్లీనరీ ముగింపు సందేశం
- వందన సమర్పణ
- సాయంత్రం 5.10 గంటలకు వైఎస్సార్సీపీ ఫ్లీనరీ-2022 ముగింపు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY