ట్విట్ట‌ర్‌కు గుడ్‌బై చెప్పిన ఎల‌న్ మ‌స్క్‌.. 44 బిలియ‌న్ల డాల‌ర్ల‌ డీల్‌ క్యాన్సిల్

Tesla CEO Elon Musk Terminates The Proposed Acquisition of $44bn Deal with Twitter, CEO Elon Musk Terminates The Proposed Acquisition of $44bn Deal with Twitter, Elon Musk Terminates The Proposed Acquisition of $44bn Deal with Twitter, Musk Terminates The Proposed Acquisition of $44bn Deal with Twitter, Proposed Acquisition of $44bn Deal with Twitter, Tesla CEO Elon Musk Terminates The Proposed Acquisition, Tesla CEO Elon Musk abandons deal to buy Twitter, Musk abandons deal to buy Twitter, Elon Musk says he's terminating $44B Twitter Deal, $44B Twitter Deal, Tesla CEO withdraws $44B bid to buy Twitter, Tesla CEO Elon Musk, Elon Musk, Twitter $44 billion Deal News, Twitter $44 billion Deal Latest News, Twitter $44 billion Deal Latest Updates, Twitter $44 billion Deal Live Updates, Mango News, Mango News Telugu,

మల్టీ బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ ట్విట్ట‌ర్ సంస్థ‌ను కొనుగోలు చేయాల‌ని ప్ర‌య‌త్నించిన ఎల‌న్ మ‌స్క్ ప్రస్తుతం దానిని విరమించుకున్నాడు. ఈ క్రమంలో సుమారు 44 బిలియ‌న్ల డాల‌ర్ల‌ డీల్‌ను క్యాన్సిల్ చేశాడు. ట్విట్ట‌ర్‌తో అగ్రిమెంట్ సరైన రీతిలో లేద‌ని ఆరోపిస్తూ ఆయ‌న ఈ భారీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఎల‌న్ మ‌స్క్ శుక్రవారం ప్రకటించాడు. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లోని స్పామ్‌, ఫేక్ అకౌంట్ల‌పై పూర్తి సమాచారం అందించడంలో విఫలమైందని, దీంతో ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి తాను సిద్ధంగా లేనట్లు మ‌స్క్ తెలిపాడు. ఉన్నత స్థాయి కార్యనిర్వాహకులను మరియు టాలెంట్ అక్విజిషన్ టీమ్‌లో మూడింట ఒక వంతు మందిని ట్విట్టర్ తొలగించడం కూడా తాను ఈ నిర్ణయానికొచ్చిన్నట్లు మస్క్ చెప్పాడు.

అయితే మస్క్ తీసుకున్న నిర్ణయం బిలియనీర్ మరియు 16 ఏళ్ల శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కంపెనీ మధ్య సుదీర్ఘ న్యాయపరమైన గొడవకు దారితీసే అవకాశం ఉంది. వివాదాస్పద విలీనాలు మరియు సముపార్జనలు డెలావేర్ కోర్టుల్లోకి రావడమే కాకుండా, లావాదేవీలను పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశించడం కంటే కూడా, కంపెనీలు డీల్‌లను మళ్లీ చర్చలు జరపడం లేదా కొనుగోలుదారుడు సెటిల్‌మెంట్‌ను చెల్లించడం ద్వారా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని వారాల్లో కోర్టు విచారణలు ప్రారంభమవుతాయని, మరి కొన్ని నెలల్లో దీనికి పరిష్కారం లభిస్తుందని ట్విట్టర్ భావిస్తోంది. కాగా దీనిపై ఎల‌న్ మస్క్ తరపు న్యాయవాదులు స్పందిస్తూ.. ట్విట్టర్ ఆ ఒప్పందంలోని ముఖ్యమైన నిబంధనలను ఉల్లంఘించింది, తప్పుదోవ పట్టించే ప్రాతినిధ్యాలు చేసినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =