ఒకప్పుడు జబ్బులతో బాధపడే మనుష్యులు చాలా తక్కువ మంది ఉండేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఆహారపుటలవాట్లు, కాలుష్యం బారిన పడటం వంటి కారణాలతో మనిషికి తెలీకుండానే జబ్బుల పాలవుతున్నాడు. అయితే పెరుగుతున్న వ్యాధులకు రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీతోనే చెక్ పెట్టే రోజులు ఉండటంతో .. కాస్త మనిషి ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. ఆ టెక్నాలజీతోనే అసాధ్యమనుకునే ఎన్నో సర్జరీలను డాక్టర్లు సునాయాసంగా చేసి ప్రాణాల్ని కాపాడుతున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకూ సర్జరీ అంటే అదేదో పెద్ద విషయంగా అంతా అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కుట్లే లేకుండా లాప్రోస్కోపీ సర్జరీలు వచ్చేశాయి. సర్జరీ చేయించుకుంటే నెల రోజులు మంచం దిగకుండా రెస్టు తీసుకునే రోజుల నుంచి ఇలా సర్జరీ అవగానే..అలా స్వంతంగా పనులు చేసేసుకునే రోజులకు వచ్చేశారు . వైద్యరంగంలో వచ్చిన ఈ మార్పులకు టెక్నాలజీ ఓ వరంగా మారడమే కారణం. అలాగే ఇప్పుడు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు మరో అద్భుతాన్ని కనుగొన్నారు .
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు..ప్రమాదాలలో కానీ, వ్యాధుల పరంగా కానీ మెదడులో గాయమైతే దానికి ‘త్రీడీ’ ట్రీట్మెంట్ చేసే అద్భుతమైన విధానాన్ని అభివృద్ది చేశారు. ఇంకా చెప్పాలంటే కేవలం ఒకే ఒక్క రోజులో మెదడులోని గాయాలతో బాధపడేవారికి ఉపశమనం కలిగించే అద్భుత వైద్యాన్ని కనుగొన్నారు. సెరిబ్రల్ కార్టెక్స్ నిర్మాణాన్ని అనుకరించడానికి..నాడీ కణాలను త్రీడీ-ప్రింట్ చేయొచ్చని పరిశోధకులు మొట్ట మొదటిసారిగా నిరూపించారు.
పెరాలసిస్ అంటే పక్షవాతం , ట్రామా, క్యాన్సర్ వంటి శస్త్రచికిత్సల తర్వాత మెదడులో అయ్యే గాయాలతో.. మనిషిలో కమ్యూనికేషన్, కదలికలు, మేధో సామర్థ్యాలను దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఇబ్బందికర పరిస్థితి నుంచి పేషెంట్‌ను బయటకు తీసుకురావడానికి పరిశోధకులు సరికొత్త పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. దీని ప్రకారం నాడీకణ మూలకణాల సాయంతో.. త్రీడీ ప్రింటింగ్ విధానంలోనే రెండు పొరల మెదడు కణజాలాన్ని డెవలప్ చేశారు. మెదడు అవుటర్ లేయర్ అయిన సెరబ్రల్ కార్టెక్స్ నిర్మాణాన్ని అది పోలి ఉంది. ఈ ప్రయోగాన్ని ముందుగా ఎలుకల్లో చేయగా.. ఇలాంటి టిష్యూ అచ్చం సహజసిద్ధ నిర్మాణం లాగే పనిచేసిందని పరిశోధకులు చెబుతున్నారు. మానవుల్లోనూ మెదడు గాయాలకు.. ఈ త్రీడీ ముద్రణ విధానంతో మెరుగ్గా మరమ్మతులు చేయడానికి ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 మిలియన్ల మంది టీబీఐ అంటే.. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీతో బాధపడుతున్నారని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 5 మిలియన్ కేసులు మాత్రం చాలా తీవ్రమైనవి లేదా ప్రాణాంతకంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వైద్యరంగంలో తీవ్రమైన మెదడు గాయాలకు సమర్థవంతమైన ట్రీట్మెంట్‌లు లేవు. దీంతో ఈ సమస్య వస్తే వాళ్లు ఇక జీవితంపై ఆశలు వదులుకునేవాళ్లు. అయితే ఇప్పుడు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్న ఈ త్రీడీ ట్రీట్మెంట్.. అందుబాటులోకి వస్తే మాత్రం ఎంతోమంది బ్రెయిన్ ఇంజ్యూరీతో బాధపడేవారి సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్యులు ఎదురు చూస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE