బెంగళూరు ‘సాయ్‌’ అకాడమీలో.. 33 మందికి కోవిడ్‌ పాజిటివ్

16 India men’s hockey players tests positive, 16 of Them Hockey Players, 33 COVID-19 cases detected at SAI Bengaluru, 33 Covid-19 Positive Cases Detected At SAI in Bengaluru, 33 from Indian Hockey team test positive for COVID, 33 people test Covid-19 positive at SAI Bengaluru, Covid-19 Positive Cases, Covid-19 Positive Cases Detected At SAI, Hockey Players Covid-19 Positive, Mango News, Sports Authority of India, sports news

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) బెంగళూరులోని ఎక్స్‌లెన్స్‌ కేంద్రంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడ శిక్షణలో ఉన్న మొత్తం 128 మందికి పరీక్షలు నిర్వహించగా.. 33 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఏకంగా పురుషుల హాకీ సీనియర్‌ జట్టులోని 16 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే, మహిళల జూనియర్‌ హాకీ టీమ్‌లోని 15 మందికి పాజిటివ్‌గా రావటం సంచలనం అయింది.

వీరితోపాటు.. మహిళల జట్టులోని ఇద్దరు, ఒక కోచ్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. అయితే, పాజిటివ్‌ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సాయ్‌ బెంగళూరు కేంద్రం తెలిపింది. కాగా, దక్షిణాఫ్రికాలో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ కోసం ఆటగాళ్లు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. కిందటి వారం పటియాలలోని సాయ్‌ కేంద్రంలో కూడా 25 కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =