ముంబై నావల్‌ డాక్‌యార్డ్‌ నుంచి ఐఎన్ఎస్ ఇంఫాల్‌ ఎంట్రీ

Another Brahmastra In India, Another Brahmastra, Brahmastra In India, INS Imphal, INS,Brahmos Anti Ship Missile System, Internal Organization, Mumbai Naval Dockyard, Latest Brahmastra News India, Latest Brahmastra News Updates, Brahmastra, Indian Missile, Missile, Latest Indian Army News, Indian Army, India, Mango News, Mango News Telugu
INS Imphal ,INS,BrahMos anti-ship missile system,Internal organization,Another Brahmastra in India, Mumbai Naval Dockyard

డ్రాగన్‌కంట్రీ చైనాకు చెక్‌ పెట్టడానికి ఇండియా ..జల, వాయు, భూతలం నుంచి చైనా చేస్తున్న దాడులను తిప్పి కొట్టడానికి  సన్నద్ధం అవుతోంది.దీనిలో భాగంగా ముంబైలో ఐఎన్ఎస్ ఇంఫాల్‌ జల ప్రవేశం చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌక .. ఇప్పుడు అందుబాటులోకి రావడంతో ఇండియన్‌ నేవీ అమ్ములపొదిలో మరో అద్బుత అస్త్రం చేరినట్లు అయింది.  ముంబై నావల్‌ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమానికి రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే కూడా హాజరయ్యారు.

ఐఎన్ఎస్ ఇంఫాల్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది న్యూ  స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ ఆర్మీ లాగే..ఇప్పుడు ఇండియన్ నేవీ కూడా అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు, విధ్వంసక యుద్ధ నౌకలను మెల్లగా సమకూర్చుకుంటోంది.

ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్‌ను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేశారు. శత్రువుల రాడార్‌ను కూడా  ఢీకొని ముందుకు సాగడంతో పాటు దాన్ని శత్రువు రాడార్‌ కూడా గుర్తించకుండా ఉండేలా చూడటం దీని  ప్రత్యేకత. అలాంటి సమయంలో ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ తనకు ఇచ్చిన ఆపరేషన్‌ను నిర్వర్తిస్తుంది.

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ పేరు మీద ఐఎన్ఎస్ ఇంఫాల్‌  యుద్దనౌకను నిర్మించారు. నేవీలో కమీషన్ చేయడానికి ముందే దీనిని అన్ని రకాలుగా పరీక్షించారు. ఐఎన్ఎస్ ఇంఫాల్‌ నుంచి సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా విజయవంతంగా టెస్ట్ చేశారు. డిస్ట్రాయర్ యుద్ధనౌక ఇంఫాల్‌ను నడపడానికి.. దానిలో 4 గ్యాస్ టర్బైన్‌లను అమర్చారు. దీని వేగం 30 నాట్స్ కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఐఎన్ఎస్ ఇంఫాల్‌లో సర్ఫేజ్ నుంచి సర్ఫేజ్‌కు.. సర్ఫేజ్ నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను కూడా కలిగి ఉంటుంది. యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్ కోసం బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సైల్ సిస్టమ్‌ను కూడా ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్‌లో ఏర్పాటు చేశారు. భారతదేశానికి చెందిన ఈ ప్రమాదకరమైన డెస్ట్రాయర్ యుద్ధ నౌకను ఇంటర్నల్ ఆర్గనైజేషన్ వార్‌షిప్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది.

ఐఎన్ఎస్ ఇంఫాల్‌‌ను  మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ మొత్తం సామర్థ్యం 7400 టన్నులు కాగా.. మొత్తం పొడవు 164 మీటర్లు. ప్రమాదకరమైన క్షిపణులతో పాటు ఇది యాంటీ షిప్ మిస్సైల్స్, టార్పెడోలు, ఇతర లేటెస్ట్ వెపన్స్, ఆయుధాలు, సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE