కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ శివకుమార్ సహా 124 మందితో తొలిజాబితా విడుదల చేసిన కాంగ్రెస్

Karnataka Assembly Polls Congress Released 1st List of 124 Candidates EX CM Siddaramaiah To Contest From Varuna Constituency,Karnataka Assembly Polls Congress Released 1st List,Congress Released 1st List of 124 Candidates,EX CM Siddaramaiah To Contest From Varuna Constituency,Mango News,Mango News Telugu,Congress Announces Candidates in 124 Constituencies,Karnataka Polls,Congress Announces First List,Karnataka Assembly Polls 2023,Karnataka Elections 2023,Karnataka Elections Latest News

కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. శనివారం విడుడల చేసిన ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ శివకుమార్ సహా పలువురు ప్రముఖులు పోటీ చేసే స్థానాలు వెల్లడించింది. మార్చి 17న ఢిల్లీలో జరిగిన సమావేశం తర్వాత పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల తొలి జాబితాను నిర్ధారించింది. ఈ కమిటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహిస్తుండగా.. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. శనివారం ప్రకటించిన జాబితా ప్రకారం.. మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు ఆయన వరుణ స్థానం నుంచి పోటీకి దిగుతుండటం విశేషం. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా సిద్ధరామయ్య సేవలను ఉపయోగించుకోవాలనే కాంగ్రెస్ గేమ్ ప్లాన్‌తో హై వోల్టేజ్ ప్రచారానికి మంచి ఊపు అవకాశం ఉంది.

ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ తన కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మరోవైపు మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలు దేవనహళ్లి, చితాపూర్ (ఎస్సీ) నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే కొరటగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరను పార్టీ బరిలోకి దింపింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దివంగత ధృవనారాయణ కుమారుడు దర్శన్ ధృవనారాయణకు నంజన్‌గూడ్ (ఎస్‌సి) నియోజకవర్గం నుండి టిక్కెట్ కేటాయించబడింది. ఇక్కడ ఆయన మాజీ కేంద్ర మంత్రి వి. శ్రీనివాస ప్రసాద్ అల్లుడు బిజెపికి చెందిన బి. హర్షవర్ధన్‌తో గట్టి పోటీని చూసే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు మరికొందరు ముఖ్య నాయకులు పోటీ చేసే స్థానాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − two =