షర్మిలకు కలిసొచ్చే కాలం రాలేదా?

Sharmila Will Get The Same Scene Repeat Itself In AP, Sharmila Will Get The Same Scene, Same Scene Repeat Itself In AP, Telangana Congress, AP congress,YS Sharmila, AP, Isnt It Time For Sharmila, Latest Sharmila Political News, CM Jaga, Chandrababu Naidu, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Telangana Congress, AP congress,YS Sharmila, AP, Isn't it time for Sharmila

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు మరోసారి తెరమీదకు వస్తోంది.  జగనన్న వదిలిన బాణంగా  ఏపీలో అన్నతరపున ప్రచారం చేసి.. అధికారం వచ్చాక చివరకు అదే అన్నతో  విభేదించి.. తెలంగాణలో అయినా సత్తా చాటుకోవాలనే ఉద్దేశంతో  పార్టీని స్థాపించారు షర్మిల. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలను కూడా నిర్వహించారు. తన తండ్రి మీద ఉన్న అభిమానంతో పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, ముఖ్యంగా తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం అంతా తనవైపే ఉంటుందని  ఆశలు పెట్టుకున్నారు .

కానీ  అనుకున్నంత సీన్ తెలంగాణలో కనిపించలేదు. దీంతో  ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు.  ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన షర్మిల.. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడానికి  ప్రయత్నించారు. కానీ  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి  వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ విలీన ప్రక్రియకు  కూడా బ్రేకులు పడ్డాయి.

ఏపీ రాజకీయాల్లో షర్మిలను  యాక్టివ్ కావాలని కాంగ్రెస్ అధిష్టానం  ఒత్తిడి పెంచినా, షర్మిల మాత్రం తాము తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించడంతోనే  కాంగ్రెస్ లో వైస్సార్టీపీ విలీన ప్రక్రియ నిలిచిపోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. కాంగ్రెస్ కు ఊపు తీసుకు రావడానికి అధిష్టానం  ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను షర్మిలకు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.

ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే షర్మిలకు మరోసారి భంగం తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎప్పటి నుంచో అంతంత మాత్రమే అన్నట్టుగా తయారయింది. పేరుకు మాత్రమే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉంది. క్షేత్రస్థాయిలో  ఆ పార్టీకి బలం లేదు. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్‌కు చెందిన నేతలు, కార్యకర్తలు చాలామంది ఇతర పార్టీలలో సర్ధుకున్నారు.

ఇప్పుడు షర్మిలకు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నా..ఆ ప్రభావం ఏపీ కాంగ్రెస్‌లో పెద్దగా కనిపించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించినపుడు ఏపీతో అసలు సంబంధమే లేదన్నట్లు మాట్లాడటం,  తెలంగాణ వాదం ఎత్తుకోవడం, తాను తెలంగాణ బిడ్డనని  చెప్పుకోవడం వంటివి ఏపీ వాసుల మనసులో నాటిపోయింది. దీంతోనే జగన్ పై ఉన్న వ్యతిరేకత షర్మిలకు ప్లస్ అవుతాయన్న లెక్కలు ఎప్పుడో తప్పాయని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =