భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ గాయపడ్డాడు. సోమవారం నాడు నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత నెట్స్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మయాంక్ అగర్వాల్ హెల్మెట్ కు బంతి తగలడంతో గాయపడ్డాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని అంచనా వేసిందని మరియు కంకషన్ టెస్ట్ నిర్వహించబడిందని చెప్పారు. అతను కంకషన్ సంకేతాలను చూపించడంతో ఇంగ్లాండ్ తో తోలి టెస్టుకు దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. 30 ఏళ్ల మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం స్థిరంగా ఉందని మరియు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపారు. మరోవైపు ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తోలి టెస్టు జరగనుంది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత్ జట్టు మొత్తం 5 టెస్టులు ఆడనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































