కాంగ్రెస్ పార్టీ మరియు దానికి అనుబంధంగా ఉన్న ‘భారత్ జోడో యాత్ర’ ప్రచారానికి సంబంధించిన హ్యాండిల్స్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని బెంగళూరు కోర్టు ట్విట్టర్ సంస్థను ఆదేశించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతున్న సందర్భంలో అనుమతి లేకుండా కాపీరైట్ కేజీఎఫ్-2 సినిమాలోని పాటలను అనధికారికంగా ఉపయోగించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఎంఆర్టీ మ్యూజిక్ అధినేత నవీన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తన ట్విట్టర్ లో రెండు వీడియోలు ప్రదర్శించారని, వాటిలో కేజీఎఫ్-2 సంగీతాన్ని వినియోగించారని ఫిర్యాదులో తెలిపారు.
కాపీరైట్ మరియు ఐపీసీ నిబంధన ప్రకారం దీనికి బాధ్యులైన కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్ మరియు సుప్రియపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కాగా దీనిపై కాంగ్రెస్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘తమకు సంబంధించిన రెండు ట్విట్టర్ హ్యాండిల్స్‌కు వ్యతిరేకంగా బెంగళూరు కోర్టు ఇచ్చిన ప్రతికూల ఆర్డర్ గురించి మేము సోషల్ మీడియాలో చదివాము. కోర్టు విచారణల గురించి మాకు తెలియదు. మాకు ఇంకా ఆర్డర్ కాపీ అందలేదు. మేము మా వద్ద ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను అనుసరిస్తున్నాము’ అని కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE