“పరాక్రమ దివాస్” గా నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి, కేంద్రం నిర్ణయం

Centre Announces Subhas Chandra Bose's Birth Anniversary As Parakram Diwas

నేతాజీ సుభాస్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23 వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ దివస్‌’గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశం కోసం ఎవరికీ లొంగని ఆత్మవిశ్వాసంతో నేతాజీ చేసిన నిస్వార్థ సేవను గౌరవించటానికి మరియు గుర్తుంచుకోవడానికి ప్రతి సంవత్సరం జనవరి 23 వ తేదీన “పరాక్రమ దివాస్” జరుపుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే నేతాజీ 125 వ జయంతి వార్షికోత్సవాన్ని జనవరి 23, 2021 నుండి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్ణయించడం, స్మారక ఉత్సవాలను పర్యవేక్షించి, మార్గనిర్దేశం చేయడం కోసం ఈ కమిటీ పనిచేయనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ