ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా

CM KCR Inquired about Samajwadi Party Leader Mulayam Singh Yadav Health Condition, Mulayam Singh Yadav in ICU, UP Former CM Mulayam Singh Yadav Health Stable, UP Former CM Mulayam Singh Yadav, Mulayam Singh Yadav,Ex-Up CM Health Deteriorates, Ex-Up CM Shifted To ICU , Mango News, Mango News Telugu, CM KCR Asks About Mulayam Singh Yadav Health, Mulayam Singh Yadav Health Condition, Mulayam Singh Yadav Health, Mulayam Singh Yadav Latest News And Updates, Mulayam Singh Yadav, UP News And Live Updates

ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్ సభ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ ఆదివారం నాడు అస్వస్థత గురవడంతో గురుగ్రామ్​లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆరా తీసారు. ములాయం సింగ్ కుమారుడు, ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ములాయం యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దసరా తర్వాత తాను స్వయంగా వచ్చి కలుస్తానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో కార్యాలయం ఒక ప్రకటన చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY