కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రవ్యాప్తంగా మే 8 నుంచి మే 16 వరకు లాక్‌డౌన్‌

Kerala Govt Announced Complete Lockdown in the State from May 8 to 16th,Mango News,Mango News Telugu,Kerala Announces One-week Lockdown From May 8,Kerala Lockdown News,Covid Surge,Kerala Govt Declares Complete Lockdown From May 8 To 16,Kerala Lockdown Guidelines And Rules News,Kerala Lockdown Guidelines,Kerala Lockdown Rules,Kerala Announces Complete Lockdown,Covid-19,Kerala Announces Lockdown,Kerala,Kerala News,Kerala Lockdown News,Kerala Covid-19,Covid-19 In Kerala,Kerala Coronavirus,Kerala Coronavirus Updates,Lockdown In Kerala From May 8 To 16,Lockdown In Kerala,Kerala Lockdown Live Updates,Kerala Lockdown Latest News,Kerala Govt,Kerala Govt Announced Complete Lockdown,Lockdown In Kerala 2021,Kerala Lockdown 2021

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. బుధవారం నాడు ఒక్కరోజే 41,953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 8వ తేది నుంచి మే 16 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. “కేరళ రాష్ట్రం మొత్తం మే 8 ఉదయం 6 గంటల నుండి మే 16 వరకు లాక్‌డౌన్‌ లో ఉంటుంది. బలమైన కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది” సీఎం పినరయి విజయన్‌ పేర్కొన్నారు.

మరోవైపు కేరళలో ఇప్పటివరకు మొత్తం 17,43,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 13,62,363 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,566 మంది మరణించారు. ప్రస్తుతం 3,75,657 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కేరళ రెండో స్థానంలో కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం అత్యధిక యాక్టీవ్ కేసులు కలిగి ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర(6,41,596), కర్ణాటక (4,87,288) తర్వాత కేరళ (3,75,657) మూడో స్థానంలో ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − two =